![]() |
![]() |
బుల్లితెర మీద నిఖిల్ - కావ్య జోడి ఎంత ఫేమ్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ జోడి ఆడియన్స్ కి కూడా నచ్చింది. వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు అనుకున్న టైములో ఇద్దరూ అనుకోని కారణాలతో విడిపోయారు. ఇక ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. షోస్ లో ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఐతే ఈ వారం సుమ అడ్డా షోలో "సం ఫైర్ మొమెంట్స్" పేరుతో సుమ ఒక కాన్సెప్ట్ నిర్వహించింది. ఇక ఈ షోకి నిఖిల్, ప్రేరణ, మణికంఠ, వచ్చారు. ఇక నిఖిల్ తో మొదలు పెట్టింది సుమ. నిఖిల్ రావడమే ప్రేమ అనే బోర్డు తీసి కాల్చేశాడు. ప్రేమ అనే దాని మీద తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. "చూజ్ వైజ్లీ, సెలెక్ట్ వైజ్లీ అని ఇందులో నాది కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తెలియకుండా మోసపోయాను. ఎవరికైనా నేను చెప్పేది ఒక్కటే మీ పక్కన ఎవరు ఉండాలో డిసైడ్ చేసుకోవాలి జాగ్రత్తగా. అంత ఈజీగా నమ్మకండి జనరేషన్ అస్సలు బాలేదు. ప్రేమ అనేది అంత ఈజీ కాదు కాంప్లికేటెడ్. ఇద్దరి సైడ్ నుంచి అండర్స్టాండింగ్ ఉంటే ఫ్రెండ్ షిప్ కానీ ప్రేమ కానీ నిలబడుతుంది. అందుకే ఈ ప్రేమను నేను నిప్పుల్లో వేసి బూడిద చేస్తున్నా. ఈ ప్రేమలో ఉన్న నెగటివిటీ మొత్తం కాలిపోయి అందరికీ పోజిటివిటీని పంచాలని కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక కొన్ని టీవీ షోస్ లో నిఖిల్ ఎదురుపడిన చూడకుండా వెళ్ళిపోతోంది. ఇక నిఖిల్ కూడా కావ్యకు దూరంగా ఉంటున్నాడు. గోరింటాకు సీరియల్ టైం నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరికి వారుగా ఉన్నారు.
![]() |
![]() |